PDA Alliance : ప్రతిపక్షాల ఫ్రంట్ పేరు పీడీఏ
పేట్రియాట్రిక్ డెమోక్రటిక్ అలయన్స్
PDA Alliance : దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే జనతాదళ్ యూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలో 17 పార్టీలు పాట్నాలో సమావేశం అయ్యాయి. ఈ మేరకు కీలక నిర్ణయం కూడా తీసుకున్నాయి. మరో కీలక మీటింగ్ ను హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ కీలక భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు కంకణం కట్టుకున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వచ్చేందుకు నితీశ్ కుమార్ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు. ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. ఎట్టకేలకు అందరూ ఒకే వేదికపైకి వచ్చేందుకు ఆసక్తి చూపించారు.
ఇందులో కాంగ్రెస్ పార్టీ తరపున ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జీడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ , డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ , యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ప్రతిపక్షాల ఐక్యత కూటమికి పీడీఏ(PDA) అని పేరు పెట్టారు. దేశభక్తి ప్రజాస్వామ్య కూటమి అని ప్రకటించారు. ప్రస్తుతం పీడీఎఏ కు అందరూ ఆమోదం తెలపడం విశేషం.
Also Read : Delhi Govt Comment : క్యాంపస్ లు కావు ప్రభుత్వ బడులు