Dalai Lama : సంయమనంతోనే శాంతి సాధ్యం – దలైలామా
సరిహద్దు వివాదాలపై కామెంట్స్
Dalai Lama : ప్రముఖ టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా(Dalai Lama) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత , చైనా దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. శాంతియుత మార్గాల ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించు కోవాలని సూచించారు.
జమ్మూ, కాశ్మీర్ లో 2019 తర్వాత మొదటిసారి దలైలామా శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా లేహ్ లో ఒక నెల పాటు ఉంటారు. థిక్సే మఠాన్ని సందర్శిస్తారు.
గత రెండేళ్ల కాలంలో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వెలుపల పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సైనిక శక్తిని ఉపయోగించడం వల్ల యుద్దం తప్ప శాంతి అన్నది మిగలదన్నారు.
దాని వల్ల రక్తపాతం తప్ప ఒరిగేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు దలైలామా. కాగా లేహ్ కు చేరుకున్న దలైలామాకు అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది.
ప్రాథమిక భారత్, చైనా దేశాలు అతి పెద్ద దేశాలు. అన్ని రంగాలలోనూ శక్తివంతమైనవి. కానీ చిన్న దానికి వివాదాలకు పోవడం మంచి పద్దతి కాదన్నారు.
తూర్పు సెక్టార్ లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ )ని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించడం మంచి పద్దతి కాదన్నారు.
జూన్ 15, 2020న గాల్వాన్ లోయలో పీఎల్ఏ దళాలతో జరిగిన పోరాటంలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. ఆనాటి నుంచి ఏదో ఒక రోజు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంటూనే ఉంది.
ఇదిలా ఉండగా దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను స్వేచ్ఛను మాత్రమే కోరుతున్నానని, కానీ చైనా మాత్రం అణిచి వేయాలని చూస్తోందన్నారు. అక్కడి ప్రజలు తనను స్నేహితుడిగా భావిస్తున్నారంటూ తెలిపారు.
Also Read : కోవిడ్ నుంచి కోలుకుంటున్న స్టాలిన్