Peddireddy Ramachandra Reddy : బాబుపై పెద్దిరెడ్డి గుస్సా
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
Peddireddy Ramachandra Reddy : తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అబద్దాలలో ఆరి తేరాడని మండిపడ్డారు ఏపీ రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఇసుకపై బాబు అబద్దాల ప్రజెంటేషన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
Peddireddy Ramachandra Reddy Slams Chandrababu
అభివృద్ది, సంక్షేమం ప్రాతిపదికన తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. పెద్ది రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలోనే ఇసుక దోపిడీకి తెర లేపారని ఆరోపించారు. మహిళా తహశిల్దార్ పై దాడి చేసిన ఘటనను బయటకు రాకుండా లోపటే రాజీకి కుదిర్చాడని ఆ విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ప్రజలకు అందుబాటు ధరలోనే ఇసుక విక్రయాలు జరుపుతున్నామని, పూర్తి పారదర్శకతతో నియమ నిబంధనలు రూపొందించామన్నారు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి(Peddireddy Ramachandra Reddy). రూ. 40 వేల కోట్ల దోపిడీకి ఎక్కడ జగన్ రెడ్డి పాల్పడ్డాడో నిరూపించాలని సవాల్ విసిరారు.
నిరాధార ఆరోపణలు చేయడం మాను కోవాలని సూచించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మంత్రి. జగన్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం వల్ల రెండు మూడు రెట్లు రెవెన్యూ ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలోనే 60 లక్షల దొంగ ఓట్లు చేర్పించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : Revanth Reddy : రేవంత్ రెడ్డి యూటర్న్