Twitter Accounts Blocked : ఖలిస్తానీ నేతల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్
ఖలిస్తానీ నేత అమృత పాల్ సింగ్ ఆపరేషన్
Twitter Accounts Blocked : పంజాబ్ లో వివాదాస్పద ఖలిస్తానీ నేత , మత ప్రబోధకుడు అమృత పాల్ సింగ్ ను పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఖలిస్తానీ ఉద్యమానికి సంబంధించి అనుకూల నాయకులకు చెందిన ట్విట్టర్(Twitter Accounts Blocked) ఖాతాలు బ్లాక్ చేశారు. కెనడియన్ కవయిత్రి రూపి కౌర్ , కెనడా చట్ట సభ సభ్యురాలు జగ్మీత్ సింగ్ , స్వచ్చంధ సంస్థ యునైటెడ్ సిక్కులు, కెనడాకు చెందిన గుర్దీప్ సింగ్ సహోటాల ట్విట్టర్ ఖాతాలు నిలిపి వేయబడ్డాయి.
ఈ శనివారం నుంచి నేటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా అమృత పాల్ సింగ్ కోసం రాష్ట్ర, కేంద్ర బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 114 మంది సింగ్ అనుచరులను అరెస్ట్ చేశారు. చాలా చోట్ల ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. ఇంకా పునరుద్దరించ లేదు. ఎవరైనా భారత దేశం నుండి వీరి ట్విట్టర్ ఖాతాలను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు చట్ట పరమైన డిమాండ్ కు ప్రతిస్పందనగా నిలిపి వేసినట్లు పేర్కొంది ట్విట్టర్(Twitter Accounts Blocked).
ఇక భారత వ్యతిరేక వ్యాఖ్యలకు పేరొందిన జగ్మీత్ సింగ్ ఖాతాను సైతం బ్లాక్ చేయడం విశేషం. విదేశాల్లో ఖలిస్తానీ దాడులు పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం లండన్ లోని భారత హైకమిషన్ ను ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో లోని భారతీయ కాన్సులేట్ పై దాడి చేశారు. తలుపులు పగులగొట్టి ఆఫీసులోకి కార్యాలయంలోకి చొరబడిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశారు. దీనిని తీవ్రంగా ఖండించింది భారత్.
Also Read : పంజాబ్ లో ఆపరేషన్..టెన్షన్