Perni Nani : ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రులను తిట్టిన తిట్లు తిట్టిన తెలంగాణ వాళ్లను ఏమీ అనలేని పవన్ కళ్యాణ్ పౌరుషం లేనోడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తో దోస్తీ చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు నాని. బీజేపీతో బంధం ఇక బీఆర్ఎస్ తో స్నేహం చేస్తూ నీచ రాజకీయానికి పాల్పడుతూ నీతులు చెబితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. రాజకీయాలు చేయడం మామూలు విషయం కాదని అది సినిమాల్లో నటించినంత సులభం అనుకుంటే పొరపాటు పడినట్లేనని పేర్కొన్నారు.
గులాబీ జెండాను వెనుక జేబులో పెట్టుకుని తిరుగుతున్నది నీవు కాదా పవన్ కళ్యాణ్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పేర్ని నాని(Perni Nani). ఆంధ్ర ప్రజలను నానా అమ్మనా బూతులు హరీశ్ రావు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావంటూ నిలదీశారు. ఏ సినిమా ఆగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ తప్ప ఏం సినిమాలు వచ్చాయో చెప్పాలన్నారు మాజీ మంత్రి. సినిమాల్లో దమ్ముంటే ఎవరైనా చూస్తారని అన్నారు.
సీఎం పదవి ఇవ్వడానికి అదేమన్నా ఇవ్వడానికి ఓ వస్తువా ఏంటి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో సావాసం చేస్తే బొచ్చు తప్ప ఏమీ మిగలదన్నారు. చెడి పోవడం తప్ప బాగు పడడం ఉండదని హెచ్చరించారు. జగన్ ను విమర్శించే అర్హత, హక్కు నీకు లేదన్నారు పేర్ని నాని.
Also Read : Adipurush Movie : ఆదిపురుష్ టికెట్లకు భారీ డిమాండ్