Perni Nani : ఏపీ సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని(Perni Nani) సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ జనసేన ఆవిర్భావ సందర్భంగా తమ పార్టీని, అధినేత జగన్ రెడ్డిపై కామెంట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఇవాళ పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. స్వంత అన్ననే మరిచి పోయిన తమ్ముడు పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. రాజకీయం వేరు సినిమా వేరు అన్న సంగతి ఇంకా గుర్తించలేని స్థితిలో ఉన్నాడని అన్నారు.
నోటికి వచ్చినట్లు మాట్లాడితే జనం నమ్మరన్నారు. పవన్ కళ్యాణ్ తన పార్టీ కంటే టీడీపిని, చంద్రబాబు నాయుడును రక్షించేందుకే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించారు.
మెగాస్టార్ లేకపోతే పవన్ కళ్యాణ్ ఉండే వాడా అని ప్రశ్నించారు పేర్ని నాని(Perni Nani). విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీని ఒక్క మాట అనకుండా సభను నిర్వహించడం ద్వారా ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారో చెప్పాలన్నారు. అందరికీ నమస్కారం పెట్టిన పవన్ కళ్యాణ్ ఎందుకు తన అన్నకు నమస్కారం పెట్టలేదన్నారు.
ఇప్పటికీ ఆయన టీడీపీ బాగుండాలనే పవన్ కోరుకుంటున్నారంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి ఎప్పుడు వస్తాడోనని చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నాయని జోష్యం చెప్పారు పేర్ని నాని.
బీజేపీ, టీడీపీలను కలిపేందుకు ఆయన ప్రయత్నం చేశాడని ఆరోపించారు. పూటకో మాట మాట్లాడుతూ రోజుకో సిద్దాంతం చెబుతూ పబ్బం గడుపుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
Also Read : ఓవర్ యాక్షన్ టీడీపీ సభ్యుల సస్పెన్షన్