Perni Nani : బాబుకు పవన్ ఊడిగం – నాని
ఆ ఇద్దరికీ అంత సీన్ లేదు
Perni Nani : అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ను ఓడించి చంద్రబాబు నాయుడికి అధికారాన్ని కట్ట బెట్టడమే లక్ష్యంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడంటూ మండిపడ్డారు.
Perni Nani Comments on Pawan Kalyan
ఆరు నూరైనా సరే మరోసారి ఏపీ రాష్ట్రానికి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి కొలువు తీరడం ఖాయమన్నారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం, అదే పనిగా తమ సర్కార్ పై బురద చల్లడం తప్పితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదన్నారు పేర్ని నాని(Perni Nani).
పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ అంటే అది టెంట్ హౌజ్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు . తాను ఈ విషయాన్ని నాలుగు సంవత్సరాల కిందటే చెప్పడం జరిగిందన్నారు. ప్రస్తుతం తన పార్టీ టెంట్ హౌస్ ను చంద్రబాబు నాయుడుకు లాంగ్ లీజ్ కి ఇచ్చాడంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి.
పవన్ కళ్యాణ్ కంటున్న కలలు కల్లలు కావడం ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు పేర్ని నాని.
Also Read : CM Revanth Reddy : కాన్వాయ్ పేరుతో ఇబ్బందులు వద్దు