CJI Chandrachud : సీజేఐపై పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ

స్వ‌లింగ వివాహం చ‌ట్ట‌బ‌ద్ద‌త కేసు

CJI Chandrachud : దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది స్వ‌లింగ వివాహాలకు సంబంధించిన చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే అంశం. ఇందుకు సంబంధించి దాఖ‌లైన పిటిష‌న్ల‌పై గ‌త కొన్ని రోజులుగా వ‌రుస‌గా విచార‌ణ చేప‌ట్టింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్(CJI Chandrachud)  నేతృత్వంలోని ఐదుగురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

ఇదిలా ఉండ‌గా స్వలింగ వివాహాల చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే విష‌యంపై జ‌రుగుతున్న కేసు విచార‌ణ నుంచి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని తొల‌గించాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై బుధ‌వారం కోర్టు విచారించింది. దానిని తిర‌స్క‌రించింది. ఇది ఎంత మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ తొమ్మిదివ రోజు కావ‌డం విశేషం.

కేంద్రం ఒప్పు కోవ‌డం లేదు. సుప్రీంకోర్టు దీనిని అత్యంత సున్నిత‌మైన అంశంగా చూస్తోంది. ఇప్ప‌టికే సంచ‌ల‌న తీర్పుల‌కు పేరు పొందిన జ‌స్టిస్ సీజేఐ ఈ స్వ‌లింగ వివాహాల చ‌ట్ట‌బ‌ద్ద‌త గురించి ఎలాంటి తీర్పు వెలువ‌రిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో ప్ర‌తి ఒక్క‌రికి బ‌తికేందుకు, మాట్లాడేందుకు, స్వేచ్ఛ‌గా జీవించేందుకు ఆస్కారం ఉంద‌ని పేర్కొన్నారు. స్వ‌లింగ సంప‌ర్క వివాహం అనేది శ‌రీరాల‌కు సంబంధించిన‌ది అని స‌మాజానిద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : మోదీ గౌర‌వించ‌డం నేర్చుకో – గెహ్లాట్

Leave A Reply

Your Email Id will not be published!