Petrol Diesel Hike : కేంద్ర సర్కార్ చోద్యం చూస్తోంది. ఎన్నికల పర్వం ముగిసింది. ధరా భారం మోపడం ప్రారంభమైంది. మళ్లీ చమురు , గ్యాస్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి.
మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం అనంతరం ధరలు పెరగడం 10వ సారి. పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Diesel Hike )80 పైసలు పెంచాయి. దీంతో రూ. 7.20 గా ఉంది.
తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర(Petrol Diesel Hike )గతంలో రూ. 101.81 నుంచి రూ. 102.61గా ఉంది. కాగా డీజిల్ ధరలు లీటర్ కు రూ. 93.07 నుండి రూ. 93.87కి పెరిగాయి.
రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ లో ధరల పెంపుపై నోటిఫికేషన్ లో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ధరలు పెంచడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల విజయోత్సవాలలో మునిగి పోయిన మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరించడం దారుణం. ఇదిలా ఉండగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు , ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా ధరల పెరుగుదలపై సీరియస్ అయ్యారు.
ప్రధాని మోదీ చూసీ చూడనట్లు వ్యవహరించడంపై మండిపడ్డారు. ఆయన తాను రాజునని అనుకుంటున్నారని కానీ రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
ఇదిలా ఉండగా పార్లమెంట్ సాక్షిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై తీవ్ర స్థాయిలో విపక్షాలు నిప్పులు చెరిగాయి. మరో వైపు కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచి మోయలేని భారాన్ని మోపడం దారుణం.
Also Read : ఢిల్లీలో విద్యా..ఆరోగ్య వ్యవస్థ భేష్ – స్టాలిన్