చమురు కంపెనీలు మరోసారి మోత మోగించాయి. 10 రోజుల్లో వరుసగా 9వ రోజు పెట్రోల్ , డీజిల్ ధరలను (Petrol Diesel Hike) పెంచాయి. దీంతో వినియోగదారులతో పాటు సామాన్యులకు కోలుకోలేని షాక్ తగిలింది.
గత 136 రోజులుగా పెంచకుండా ఉంటూ వచ్చిన ఆయిల్ (Petrol) కంపెనీలు ఉన్నట్టుండి ఎన్నికల ఫలితాలు అనంతరం ధరల మోత మోగిస్తున్నాయి.
ఇవాళ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. నాలుగు నెలల సుదీర్ఘ విరామం అనంతరం ధరా భారం మోపడంపై బాధితులు నిప్పులు చెరుగుతున్నారు.
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఇదంతా ఎన్నికల కోసమేనని ఆ తర్వాత భారం మోయక తప్పదని ఇప్పటికే కాంగ్రెస్ (congress) అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు.
ఇవాళ పెంచిన దానిని బట్టి చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Hike) లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. గత పది రోజులలో లీటరుకు రూ. 6.40కి పెరిగాయి. పెట్రోల్ ధర నిన్న రూ. 101.01 ఉండగా ఇప్పుడు లీటర్ కు రూ. 101.81 కి పెరిగింది.
డీజిల్ (Diesel) ధర లీటర్ కు రూ. 92.27 నుంచి 93.07కి పెరిగింది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ (Petrol) లీటర్ ధర రూ. 116.72 కాగా డీజిల్ ధర రూ. 100.94కి చేరింది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ (Petrol) ధర రూ. 107.45 కాగా డీజిల్ (Diesel) ధర రూ. 97.52కి పెరిగింది. ఇక కోల్ కతాలో పెట్రోల్ లీటర్ ధర రూ. 111.35 కాగా డీజిల్ ధర లీటర్ కు రూ. 96.22 గా ఉంది.