Petrol Hike : మ‌ళ్లీ పెట్రో మంట త‌ప్ప‌ని తంట

ఆరు రోజుల్లో ఐదవ సారి

Petrol Hike : ఓ వైపు కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వం సంబురాలు చేసుకుంటోంది. ఆయా రాష్ట్రాల‌లో గెలుపొందినందుకు గాను బిగ్ సెలెబ్రేష‌న్స్ ల‌లో మునిగి పోయింది.

ఓ వైపు ధ‌ర‌ల‌ను నియంత్రించాల్సిన ప్ర‌ధాన మంత్రి మోదీ చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే విప‌క్షాలు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాయి.

ఎన్నిక‌ల కంటే ముందు పెంచ‌కుండా ఉప‌శ‌మ‌నం క‌లిగించిన గ్యాస్, ఆయిల్ కంపెనీలు ఎన్నిక‌లైన వెంట‌నే ధ‌ర‌ల మోత(Petrol Hike) మోగిస్తోంది. దీంతో వాహ‌న‌దారులు , ప్ర‌జ‌లు ల‌బోదిబోమంటున్నారు.

క‌క్క‌లేక మింగ‌లేక క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. తాజాగా ఆరు రోజుల్లో వ‌రుస‌గా ఐదోసారి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి.

తాజాగా నాలుగున్న‌ర నెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత ధ‌రా భారం కొన‌సాగుతూనే ఉంది. పెట్రోల్ లీట‌ర్ కు 80 పైస‌లు, డీజిల్ లీట‌ర్ కు 80 పైస‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి.

మొత్తంగా చూస్తే పెట్రోల్ లీట‌ర్(Petrol Hike) కు రూ. 3.70 ఉండ‌గా డీజిల్ లీట‌ర్ కు రూ. 3.75 చొప్పున పెంచాయి ఆయిల్, గ్యాస్ కంపెనీలు. ఈ ధ‌రా భారం వాహ‌న‌దారుల‌పైనే కాకుండా సామాన్యులు,

సాధార‌ణ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై పెను భారం ప‌డ‌నుంది. రాబోయే రోజుల్లో ఇలాగే పెంచుకుంటూ పోతే పెట్రోల్ లీట‌ర్ కు రూ. 200 , డీజిల్ లీట‌ర్ కు రూ. 180 దాకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

హైద‌రాబాద్ లో పెట్రోల్ ధ‌ర రూ. 112. 13 ఉండ‌గా డీజిల్ ధ‌ర‌ల రూ. 98.68 , వైజాగ్ లో రూ. 113.08, డీజిల్ ధ‌ర రూ. 99.09 , ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర రూ. 99.11 , డీజిల్ ధ‌ర రూ. 90.42 , ముంబైలో పెట్రోల్ ధ‌రూ . 113.88, డీజిల్ ధ‌ర రూ. 98.13 , చెన్నైలో పెట్రోల్ ధ‌రూ. 104.90 పైస‌లు ఉండ‌గా డీజిల్ ధ‌ర రూ. 95.00 పైస‌లుగా ఉంది.

Also Read : మ‌ళ్లీ పెట్రో మంట గుండె ద‌డ

Leave A Reply

Your Email Id will not be published!