Petrol Prices: వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్ ! పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు !
వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్ ! పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు !
Petrol Prices: లోక్ సభ ఎన్నికలు ముగిసి వారం రోజులు తిరగక ముందే… కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు గట్టి షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పరిధిలోని సేల్స్ ట్యాక్స్‌ను పెంచింది. దీనితో వీటి ధరలు రూ.3 మేర పెరిగాయి. ఈ పెంపు తక్షణమే నేటి (జూన్ 15) నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Petrol Prices Increase
పెట్రోల్‌పై కర్ణాటక సేల్స్ ట్యాక్స్ ను 25.92శాతం నుంచి 29.84శాతానికి పెంచారు. ఇక, డీజిల్‌పై అమ్మకం పన్నును 14.3 శాతం నుంచి 18.44 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తాజా పెంపుతో రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.3, డీజిల్ ధర రూ.3.05 మేర పెరుగుతున్నట్లు కర్ణాటక(Karnataka) పెట్రోలియం డీలర్స్ అసిసోయేషిన్ తెలిపింది. దీనితో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86, డీజిల్ ధర రూ.88.94కు చేరింది.
ఈ పెంపుతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.2,500-2,800 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నట్లు కర్ణాటక ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. చివరిసారిగా రాష్ట్రంలో 2021 నవంబరులో అప్పటి బీజేపీ సర్కారు పెట్రోల్, డీజీల్ ధరలను సవరించింది. కొవిడ్ తర్వాత ప్రజలకు ఊరట కల్పించేందుకు పెట్రోల్‌పై రూ.13.30, డీజిల్‌పై రూ.19.40 మేర తగ్గించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ధరలను సవరించడం మళ్లీ ఇప్పుడే. కాగా.. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే చమురు ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : PM Modi Visit : జూన్ 18న వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోదీ