Kedarnath: కేదార్‌నాథ్ లో కర్రలతో కొట్టుకున్న యాత్రికులు

కేదార్‌నాథ్ లో కర్రలతో కొట్టుకున్న యాత్రికులు

Kedarnath : ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌ నాథ్ లో యాత్రికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఉత్తరాఖండ్‌ లోని సోన్‌ప్రయాగ్‌లో జరిగిన ఈ ఘటనలో యాత్రికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో స్థానిక అధికారులు వెంటనే స్పందించి వారిని చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్‌ చేశారు. అయితే యాత్రికులు కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్న వీడియో… ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Kedarnath – Pilgrims Fight

కేదార్‌నాథ్ (Kedarnath) యాత్ర మార్గంలో పర్యాటకుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ యాత్రలో కీలక జంక్షన్ అయిన సోన్‌ప్రయాగ్‌లోని పార్కింగ్‌ ప్రాంతంలో కొందరు యాత్రికుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. దీనితో ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. సమీపంలో దొరికిన కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీనితో దాడులు చేసుకున్నవారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభం నుంచి తరుచూ ఇలాంటి ఘటనలు అశాంతిని కలిగిస్తున్నాయి.

కేదార్‌నాథ్ యాత్రకు విశేషస్పందన లభిస్తోంది. భక్తులు అధిక సంఖ్యలో​ తరలివస్తున్నారు. స్థానిక అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మే 2న ఆలయ తలుపులు తెరిచినప్పటి నుంచి 1.14 మిలియన్లకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించారు. అధికారిక లెక్కల ప్రకారం యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లు, పోర్టర్లు, హెలి ఆపరేటర్ల సంబంధిత సేవల వ్యాపారం రూ.300 కోట్లు దాటింది.

Also Read : Air India Black Box: విదేశాలకు ఎయిరిండియా ‘బ్లాక్‌ బాక్స్‌’ పంపించడంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!