Pinarai Vijayan : మోదీ నిర్వాకం విజ‌య‌న్ ఆగ్ర‌హం

హెచ్ఎల్ఎల్ బిడ్డింగ్ వ్య‌వ‌హారంపై ఫైర్

Pinarai Vijayan : కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా దేశాన్ని త‌న కంట్రోల్ లోకి తీసుకు రావాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధానంగా తాజాగా జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో నాలుగు రాష్ట్రాల‌లో స‌త్తా చాటింది. దీంతో దానికి అడ్డు అదుపు లేకుండా పోయింది.

బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. ఇదే స‌మ‌యంలో త‌మిళ‌నాడులో గెలుక్కోవాల‌ని చూసింది. కానీ అక్క‌డ పులి లాంటి స్టాలిన్ చూసి వెన‌క్కి త‌గ్గింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌నం డీఎంకేకు ప‌ట్టం క‌ట్టారు.

అన్నాడీఎంకే, బీజేపీ కూట‌మికి చెక్ పెట్టారు. ఇదిలా ఉండ‌గా కేంద్రం కేర‌ళ స‌ర్కార్ తో క‌య్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరుపై తీవ్రంగా మండిప‌డ్డారు ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్(Pinarai Vijayan).

తిరువ‌నంత‌పురం కేంద్రంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ లైఫ్ కేర్ లిమిటెడ్ – హెచ్ ఎల్ఎల్ ఓపెన్ బిడ్డింగ్ లో రాష్ట్ర ప్ర‌భుత్వం బిడ్డింగ్ లో పాల్గొన‌కుండా నిరోధించింది. గ‌తంలో ప్ర‌భుత్వం కూడా పాల్గొనేది.

దీనిపై తీవ్ర ఆక్షేప‌ణ వ్య‌క‌తం చేశారు సీఎం. ఇది పూర్తిగా రాజ్యాంగ , స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ద‌మంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. స్వొంతంగా నిర్ణ‌యం తీసుకునే ప‌వ‌ర్ రాజ్యాంగం క‌ల్పించింద‌న్నారు.

ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. హెచ్ఎల్ఎల్ ను ప్రైవేటీక‌ర‌ణ చేయడాన్ని మాను కోవాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రాల హ‌క్కుల‌ను కాల రాస్తామ‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లేన‌ని హెచ్చ‌రించారు.

ఇది ప్ర‌జాస్వామ్యానికి మంచి ప‌ద్ద‌తి కాద‌ని స్ప‌ష్టం చేశారు విజ‌య‌న్.

Also Read : గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన భ‌గ‌వంత్ మాన్

Leave A Reply

Your Email Id will not be published!