Jacqueline Fernandez Case : జాక్వెలిన్.. పింకీ ఇరానీ కీలకం
ఆమె ద్వారానే చంద్రశేఖరన్ కు
Jacqueline Fernandez Case : దోపిడీ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగు చూశాయి. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు పరిచయం చేసిన మహిళ పింకీ ఇరానీ కీలక పాత్ర పోషించినట్లు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం అదనపు సెషన్స్ జడ్జి శైలేంద్ర మాలిక్ ముందు సీబీఐ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిలో పింకీ ఇరానీతో పాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది.
ఈ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి పింకీ ఇరానీతో పాటు ఫెర్నాండేజ్ కోర్టుకు హాజరయ్యారు. భారీ మోసానికి పాల్పడిన సుఖేష్ చంద్రశేఖర్ సన్నిహితురాలిగా ఉన్నారు పింకీ ఇరానీ. అతడిని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez Case) కు పరిచయం చేసినట్లు తెలిపింది. దోపిడీకి పాల్పడిన రూ. 200 కోట్లను తరలించడంలో పింకీ ఇరానీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ తన ఛార్జిషీట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఇదిలా ఉండగా ఛార్జిషీట్ పై విచారణ జరిపేందుకు కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా నిందితులుగా పేర్కొనని ఎం.ఎస్. ఫెర్నాండెజ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఆరోపించిన స్కాంకు సంబంధించిన మనీ లాండరింగ్ లో జాక్వెలిన్ కూడా నిందితురాలిగా ఉన్నారు.
అంతే కాకుండా బాలీవుడ్ నటులు ఫెర్నాండెజ్ , నోరా ఫతేహి సహా పలువురి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసినట్లు తాజా నివేదికలో పేర్కొంది.ముంబైకి చెందిన పింకీ ఇరానీని నవంబర్ 2022 లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న చంద్రశేఖర్ , ఆదితి సింగ్ వంటి ప్రముఖ వ్యక్తులతో సహా పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి.
Also Read : మా నాన్న పేరు వాడుకోలేదు