Pinnelli Ramakrishna Reddy : లోకేష్ దమ్ముంటే నిరూపించు
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ నీకు దమ్ముంటే నాపై చేసిన విమర్శలు, ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే. ఒకవేళ నువ్వు మగాడివైతే, నువ్వు చంద్రబాబు నాయుడికే పుట్టి ఉంటే ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. లేక పోతే దుమ్ము దులుపుతా అంటూ ఫైర్ అయ్యారు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.
Pinnelli Ramakrishna Reddy Serious Words
నేను రూ. 1,000 కోట్ల అవినీతికి పాల్పడ్డానంటూ ఎలా ఆరోపణలు చేస్తావంటూ ప్రశ్నించారు. నన్ను ఏదో చేయాలని అనుకున్న నీ అయ్య చంద్రబాబు నాయుడి నుంచే కాలేదు..నువ్వో బచ్చావి నీకు ఏమవుతుందంటూ నిప్పులు చెరిగారు. నీ వల్ల ఏమీ కాదన్నారు. లోకేష్ నువ్వు పప్పు కాదు..అంతకంటే వెర్రి పుష్పానివి అంటూ ఫైర్ అయ్యారు.
నీకు మతి చెడింది. త్వరలో ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించడం ఖాయమన్నారు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(Pinnelli Ramakrishna Reddy). పెద్దిరెడ్డిని విమర్శించే మగోడివా నువ్వు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రాజకీయ అనుభవం ముందు నీ బతుకెంత అని ప్రశ్నించారు మాచర్చల ఎమ్మెల్యే. వార్డు మెంబర్ గా గెలవ లేని సత్తా లేనోడివి ఐఏఎస్ ఆఫీసర్లను విమర్శిస్తావా అంటూ నిలదీశారు.
Also Read : CM KCR : ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తే ప్రమాదం