Prashant Kishor : పీకేకు అంతు చిక్క‌ని ప‌ల్స్

తెలంగాణ నాడి దొర‌క్క ఇబ్బంది

Prashant Kishor : భార‌తీయ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త, ఐ పాక్ ఫౌండ‌ర్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor )ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఓ జాతీయ మీడియా ఛాన‌ల్ తో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

తాము ఇంకా టీఆర్ఎస్ తో కంటిన్యూ కావ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. మ‌రో వైపు ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో తాము పీకేతో క‌లిసి వెళుతున్న‌ట్లు సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

ఇక పీకే తెలంగాణ‌లో ఎంట‌ర‌య్యారు. ప్ర‌కాశ్ రాజ్ తో క‌లిసి ప‌లు ప్రాంతాలు తిరిగారు. పీకే టీం 2 వేల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స‌ర్వే చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే రాజ‌కీయ , ఉద్య‌మ నేప‌థ్యం క‌లిగిన ప్రాంతం తెలంగాణ‌. సుదీర్గ పోరాట స్పూర్తి క‌లిగిన ప్ర‌జ‌ల చైత‌న్యం ఎటు వైపు ఉంటుంద‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ప‌లు పార్టీలు ఇప్ప‌టికే త‌మ త‌మ వేగుల ద్వారా, ప్ర‌సార సాధ‌నాల ద్వారా, త‌మ వారి ద్వారా ఆరా తీస్తున్నారు. గ‌తంలో కంటే ఈసారి అధికార పార్టీ తీవ్ర పోటీని ఎదుర్కొనక త‌ప్ప‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

నీళ్లు, నిధులు, నియామ‌కాలు పేరుతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తీవ్ర అసంతృప్తి నెల‌కొంది. ప్ర‌త్యేకించి నిరుద్యోగులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

అధికార పార్టీకి చెందిన నేత‌ల తీరు కూడా ఆ పార్టీకి కొంత త‌ల‌నొప్పిగా మారింద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ , బీజేపీ , టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది.

ఈ త‌రుణంలో తెలంగాణ‌తో టీఆర్ఎస్ టై అప్ చేసుకున్న పీకేకుPrashant Kishor )గ‌ట్టెక్కించ‌డం క‌త్తి మీద సాము లాంటిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మిగ‌తా రాష్ట్రాలు వేరు. తెలంగాణ వేరు. దానిని అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం. ఇది పీకీ ఎంత ముందుగా తెలుసుకుంటే అంత మంచిది.

Also Read : ద‌మ్ముంటే గంగుల‌పై పోటీకి దిగు

Leave A Reply

Your Email Id will not be published!