PAK vs WI 1St ODI : వెస్టిండీస్ పై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ
భారీ స్కోర్ ను ఛేజ్ చేసిన పాక్
PAK vs WI 1St ODI : నెదర్లాండ్ ను మట్టి కరిపించి ఫుల్ జోష్ తో పాకిస్తాన్ లో ఎంటరైన వెస్టిండీస్ జట్టుకు కోలుకోలేని రీతిలో షాక్ తగిలింది. తొలి వన్డే మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది.
నికోలస్ పూరన్ కెప్టెన్సీ సారథ్యంలోని విండీస్(PAK vs WI 1St ODI) జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్. దీంతో 1-0 తో
ఆధిక్యంలో నిలిచింది పాక్. స్వదేశంలో ముల్తాన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది విండీస్ .
నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 305 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ షాయీ హోప్ దుమ్ము రేపాడు. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఏకంగా 127 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ జట్టులో బ్రూక్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 70 రన్స్ చేసి రాణించాడు.
కెప్టెన్ పూరన్ 21 పరుగులకే వెనుదిరిగినా మిగతా ఆటగాళ్లు అద్భుతంగా ఆడడంతో భారీ స్కోర్ సాధ్యమైంది.
ఇక ఐపీఎల్ లో సత్తా చాటిన రోవ్ మన్ పావెల్ సత్తా చాటాడు. 32 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ కు ప్రారంభంలోనే దెబ్బ పడింది.
ఓపెనర్ ఫఖర్ జమాన్ 11 రన్స్ కే వెనుదిరిగాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ ఉల్ హక్ 65 రన్స్ చేసి పరిస్థితిని చక్కదిద్దాడు. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఏకంగా 103 పరుగులు చేసి విజయానికి దగ్గర చేర్చాడు. వికెట్ కీపర్ రిజ్వాన్ ఆఫ్ సెంచరీ సాధించాడు. 59 రన్స్ చేశాడు. అనంతరం బరిలోకి దిగిన
ఖుష్ దిల్ షా దంచి కొట్టాడు.
23 బంతులు ఆడి 41 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. పాకిస్తాన్(PAK vs WI 1St ODI) విక్టరీలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : సఫారీతో యుద్దానికి భారత్ రెడీ