China Plane Crash : చైనాకు చెందిన విమానం కుప్ప కూలింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. కున్ మింగ్ నుంచి గ్వాంగ్ జౌ కు విమానం మధ్యాహ్నం 1.11 గంటలకు బయలు దేరింది.
చైనాకు చెందిన ఈస్టర్న్ ప్యాసింజర్ జెట్ (China Plane Crash)నైరుతి చైనాలో కుప్ప కూలింది. పర్వతాలలో మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలియని సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించిందని చైనా పౌర విమానయాన అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
ఆరు ఏళ్ల నుంచి నడుస్తున్న 737-800 ఎన్జీ విమానం లో 132 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 123 మంది ప్రయాణికులు ఉండగా 9 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
విమానం కూలిన ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించింది. గ్వాంగ్లీ ప్రాంతంలోని వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలో కూలి పోయింది. పర్వత మంటలకు కారణమైందని చైనా ప్రభుత్వ మీడియా సీసీ టీవీ తెలిపింది.
విమానం పర్వత ప్రాంతంపై కుప్ప కూలడంతో సంభవించిన మంటల కారణంగా అటవీ ప్రాంతాలు ధ్వంసమైనట్లు వెల్లడించింది. ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ లను పంపించారు.
మధ్యాహ్నం 1.22 గంటలకు కూలి పోయింది. ఈ విమానం తూర్పు తీరంలోని గ్వాంగ్ జౌ లో మధ్యాహ్నం 3.30 గంటలకు దిగాల్సి ఉంది.
ఈ ప్రమాద ఘటనలో పూర్తిగా చని పోయి ఉంటారని భావిస్తున్నారు. కానీ ఇంకా చైనా ప్రభుత్వం వివరాలు వెల్లడించ లేదు.
Also Read : భారత్ పై ప్రశంస పాక్ ఆర్మీపై ఫైర్