Nepal Plane Missing : నేపాల్ లో విమానం అదృశ్యం

న‌లుగురు భార‌తీయుల‌తో 22 మంది జ‌ర్నీ

Nepal Plane Missing : ఇటీవ‌ల విమాన ప్ర‌మాదాలు చోటు చేసుకోవ‌డం స‌ర్వ సాధార‌ణంగా మారింది. తాజాగా నేపాల్ లోని ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ న‌డుపుతున్న చిన్న ప్ర‌యాణీకుల విమానం ఆదివారం న‌లుగురు భార‌తీయుల‌తో స‌హా 22 మంది అదృశ్య‌మైన‌ట్లు(Nepal Plane Missing) ఎయిర్ లైన్ అధికారులు వెల్ల‌డించారు.

తారా ఎయిర్ 9 ఎన్ఈటీ జంట – ఇంజిన్ విమానం నేపాల్ రాజ‌ధాని ఖాట్మండుకు వాయువ్యంగా 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప‌ర్యాట‌క ప‌ట్ట‌ణం పోఖారా నుండి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న జోమ్ సోకు ఎగురుతుండ‌గా సంబంధం (లైన్ క‌ట్ ) తెగి పోయిన‌ట్లు వెల్ల‌డించారు.

స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 9.55 గంట‌ల‌కు ఈ విమానం నుంచి సంబంధాలు తెగి పోయిన‌ట్లు స‌మాచారం. విమానం ముస్తాంగ్ జిల్లా లోని జోమ్సోమ్ ఆకాశంలో క‌నిపించింది.

త‌ర్వాత మౌంట్ ధౌల‌గిరికి మ‌ళ్లించ బ‌డింది. అనంత‌రం ఆ ఫ్లైట్ కాంటాక్ట్ డిస్ క‌నెక్ట్ అయ్యింది అని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీస‌ర్ నేత్ర ప్ర‌సాద్ శ‌ర్మ వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని ఏఎన్ఐ తెలిపింది.

విమానంలో న‌లుగురు భార‌తీయులు, ముగ్గురు జ‌పాన్ జాతీయులు ఉన్నారు. మిగిలిన వారంతా నేపాలీయులు(Nepal Plane Missing) ఉన్నారు. విమానంలో సిబ్బందితో స‌హా 22 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స్టేట్ టెలివిజ‌న్ స్ప‌ష్టం చేసింది.

పోలీసుల అధికారుల ప్ర‌కారం హిమాల‌య దేశంలో ఐదో అతి పెద్ద జిల్లా , ముక్తినాథ్ ఆల‌య తీర్థ యాత్ర‌కు ఆతిథ్యం ఇచ్చే ప‌ర్వ‌త ముస్తాంగ్ జిల్లాలోని లేటేలోని టిటి ప్రాంతంలో విమానం కూలి పోయింద‌ని అనుమానిస్తున్నారు.

ఏదో చ‌ప్పుడు వినిపించిన‌ట్లు కొంద‌రు తెలిపారు. సెర్చ్ ఆప‌రేష‌న్ కోసం ఆ ప్రాంతానికి హెలికాప్ట‌ర్ ను పంపిస్తున్న‌ట్లు ముస్తాంగ్ జిల్లా పోలీసు ఆఫీస్ డీఎస్పీ రామ్ కుమార్ డానీ తెలిపారు.

Also Read : మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డ‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!