PM Modi Visit : ఎట్టకేలకు అభివృద్ది పనులకు మోక్షం
ప్రధానమంత్రి మోదీ రాక కోసం
PM Modi Visit : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం(PM Modi Visit) చుట్టనున్నారు. శనివారం ఎయిమ్స్ , వందే భారత్ రైలు, హైవేలను ప్రారంభిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో ప్రసంగిస్తారు. బీబీనగర్ ఎయిమ్స్ కు శంకుస్థాపన చేస్తారు మోదీ. దేశ వ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనే పీఎం ఆలోచనకు ఇది నిదర్శనమని పీఎంఓ పేర్కొంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ లో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు.
తెలంగాణలో మొత్తం రూ. 11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఎయిమ్స్ బీబీనగర్ , ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్దికి శంకుస్థాపన(PM Modi Visit) చేస్తారు. రైల్వే శాఖకు సంబంధించిన ఇతర అభివృద్ది కార్యక్రమాలను జాతికి అంకితం చేస్తారు నరేంద్ర మోదీ. హైదరాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు ప్రారంభం కానుండడంతో ప్రయాణికులకు, భక్తులకు మరింత మేలు జరగనుంది.
మూడున్నర గంటల సమయం తగ్గుతుంది. రైల్వే స్టేషన్ ను రూ. 720 కోట్లతో అభివృద్ది చేయనున్నారు. హైదరాబాద్ లో 13 కొత్త ఎంఎంటీఎస్ సేవలకు శ్రీకారం చుడతారు. సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ ప్రాజెక్టు డబ్లింగ్ , విద్యుదీకరణ పనులను కూడా జాతికి అంకింతం చేయనున్నారు ప్రధానమంత్రి. రూ. 1,410 కోట్ల ఖర్చు తో 85 కి.మీ.ల మేర దీనిని పూర్తి చేశారు. రూ. 7,850 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
Also Read : ప్రారంభానికి చెన్నై టెర్మినల్ సిద్దం