PM Modi : రైలు ప్రమాదం కేంద్రం సాయం
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
PM Modi : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోరమైన రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇప్పటి దాకా 237 మంది ప్రాణాలు కోల్పోగా 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఒక బోగి పూర్తిగా పనికి రాకుండా పోయింది. అందులో ఉన్న మృత దేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఎక్కడ చూసినా మృత దేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. భారత దేశ చరిత్రలోనే ఈ రైలు దుర్ఘటన అత్యంత బాధాకరం.
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కార్ కు సహాయంగా ఉండేందుకు దళాలను పంపింది. మరో వైపు ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం ప్రకటించింది.
రైలు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు దేశ ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోదీ. మృతులలో ఏయే రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారో వారికి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం ప్రకటించాయి.
Also Read : PM Modi Express