PM Modi Bows : రాజ్యాంగం లేకపోతే దేశం లేదు – మోదీ
సకాలంలో న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు
PM Modi Bows : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో రాసిన రాజ్యాంగం అన్నది లేకపోతే దేశం లేదన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. నవంబర్ 26న ప్రతి ఏటా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. శనివారం ప్రధాన మంత్రి రాజ్యాంగానికి వినమ్రంగా నమస్కరించారు.
ఈ సందర్బంగా నరేంద్ర మోదీ(PM Modi Bows) కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ సకాలంలో న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు అనేక చర్యలు తీసుకుంటోందని ప్రశంసించారు. వేగవంతమైన అభివృద్దితో పాటు ఆర్థిక వృద్దిని సాధిస్తున్న భారత దేశం వైపు ప్రపంచం మొత్తం చూస్తోందని చెప్పారు.
రాజ్యాంగ ప్రవేశిక లోని ప్రజలమైన మనం నిబద్దత, ప్రతిజ్ఞ, విశ్వాసం భారత దేశాన్ని ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిగా మార్చేసిందన్నారు. ఈ సందర్భంగా మనందరం స్మరించు కోవాల్సిన వ్యక్తులు ఉన్నారు. వారే భారత రాజ్యాంగ నిర్మాతలని కొనియాడారు. వారికి ప్రతి ఒక్కరం రుణపడి ఉన్నామని చెప్పారు నరేంద్ర మోదీ.
దేశానికి స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల దిశగా ముందుకు సాగుతున్న సందర్భంగా దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లేందుకు ప్రాథమిక విధులను నెరవేర్చడం పౌరుల ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలన్నారు.
వ్యక్తి అయినా లేదా సంస్థలు అయినా మన విధులే మన మొదటి ప్రాధాన్యత కావాలన్న గాంధీని ఈ సందర్భంగా ప్రస్తావించారు ప్రధాన మంత్రి. ఇవాళ దేశం పూర్తి సామర్థ్యంతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజల శక్తితో సాధికారత పొందుతోందన్నారు.
అట్టడుగు వర్గాలకు న్యాయం అందినప్పుడే నిజమైన రాజ్యాంగం ఆశయం నెరవేరినట్లవుతుందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
Also Read : భారత రాజ్యాంగం దేశాన్ని నడిపించే సాధనం