Modi : ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో 20 వేల మందికి పైగా విద్యార్థులు ఆ దేశంలో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 7 వేల మందికి పైగా తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర సర్కార్.
అయినా ఇంకా చాలా మంది అక్కడే చిక్కుకు పోయారు. ఇవాళ ఉన్నట్టుండి రష్యా దయదల్చింది. ఐదున్నర గంటల పాటు యుద్ద విరామం ప్రకటించింది. విదేశీయులు తమ దేశాలకు వెళ్లేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా చీఫ్ పుతిన్ వెల్లడించారు.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ప్రస్తుతం ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితిపై ఆరా తీశారు.
ప్రధానంగా అక్కడే రాకుండా చిక్కుకు పోయిన వారందరినీ సురక్షితంగా ఎలా ఇండియాకు తీసుకు రావాలనే దానిపై సమీక్షించారు నరేంద్ర మోదీ(Modi).
ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జై శంకర్ , పీయూష్ గోయల్ , విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్దన్ ష్రింగ్లా , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు.
ఉక్రెయిన్ లో రష్యా బలగాలు తీవ్ర స్థాయిలో సైనిక దాడులు చేస్తోంది. గత కొన్ని రోజులుగా సీనియర్ ఆఫీసర్లు, కేంద్ర మంత్రులతో ప్రధాన మంత్రి మోదీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
యుద్దం ప్రాంతం నుంచి తమ పౌరులను తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో భారీ తరలింపు మిషన్ ను ప్రారంభించింది.
ఇదిలా ఉండగా రష్యా దాడుల్లో, కాల్పుల్లో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో పరిస్థితి దయనీయంగా, భయానకరంగా ఉంది.
Also Read : రెండో విడత పోలింగ్ హింసాత్మకం