PM Modi : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అరుదైన ఘనత సాధించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడేలా చేయడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసలతో ముంచెత్తారు దేశ ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ.
PM Modi Congratulates to RBI Governer
ప్రపంచ వేదికపై మన ఆర్థిక నాయకత్వాన్ని ప్రతిబిబించేలా ప్రయ్నతం చేశారని ఇది మనందరికీ గర్వ కారణంగా నిలిచిందని పేర్కొన్నారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు పీఎం. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే కాలంలో భారత దేశం ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందనడంలో సందేహం లేదని ఆశా భావం వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ(PM Modi). ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ కనబర్చిన అంకిత భావం, దార్శనికత దేశం అభివృద్ది పథాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పొషించడం ఖాయమన్నారు.
కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ అరుదైన ఘనత సాధించారు. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023లో ఆర్బీఐ గవర్నర్ A+ రేటింగ్ పొందారు. ఈ రేటింగ్ లో వరల్డ్ వైడ్ గా ముగ్గురు ఆర్థిక సంస్థలకు సంబంధించి టాప్ లో నిలిచారు. ఇందులో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకున్నారు.
Also Read : RBI Governor : ఆర్బీఐ గవర్నర్ నెంబర్ 1
