PM Modi Telangana Tour : తెలంగాణకు రానున్న పీఎం మోదీ
విస్తృత ఏర్పాట్లలో బీజేపీ
PM Modi Telangana Tour : మునుగోడు ఉప ఎన్నిక ముగిశాక అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నవంబర్ 12న శనివారం మొదట ఏపీలోని విశాఖపట్నంలో పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. బేగంపేటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(PM Modi Telangana Tour) బీజేపీ శ్రేణులు స్వాగతం పలుకుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు.
అక్కడ కొద్ది సేపు కాషాయ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో ప్రధాన మంత్రి ముచ్చటిస్తారు. అనంతరం 2.15 గంటలకు హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ జిల్లా రామగుండంకు చేరుకుంటారు. ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడికి 3.30 గంటలకు చేరుకుని రామగుండం ఎరువులు, రసాయానాల పరిశ్రమ (ఆర్ఎఫ్సీఎల్) ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభిస్తారు.
సాయంత్రం 4.15 గంటలకు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది.
మోదీ పర్యటనలో భాగంగా రూ. 9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని పేర్కొంది. ఇదే సమయంలో రూ. 1,000 కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డుతో పాటు సత్తుపల్లి రైల్వే లైనును జాతికి అంకితం చేస్తారని స్పష్టం చేసింది.
జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశాక సాయంత్రం 6.30 గంటలకు రామగుండం నుండి తిరుగు ప్రయాణం అవుతారని పేర్కొంది. మరో వైపు మోదీ టూర్ కు తమను ఆహ్వానించ లేదంటూ టీఆర్ఎస్ ఆరోపించింది. కాగా తాము పంపించామంటూ కేంద్రం లేఖను విడుదల చేయడంతో మౌనం వహించారు.
Also Read : దేశం కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్దం