PM Modi Conrad Sangma : సీఎం సంగ్మా సక్సెస్ సూపర్ – మోదీ
కాన్రాడ్ కు ప్రధానమంత్రి అభినందన
PM Modi Conrad Sangma : ఈశాన్య ప్రాంతంలోని మేఘాలయలో ఎన్నికలు ముగిశాయి. మొత్తం 60 స్థానాలకు గాను 26 స్థానాలు కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ). దీనికి కాన్రాడ్ సంగ్మా(Conrad Sangma) ఉన్నారు. ఎన్నికల కంటే ముందు వరకు భారతీయ జనతా పార్టీ , ఎన్పీపీ కలిసే ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించాయి. చివరకు ఎన్నికల తర్వాత బీజేపీకి కేవలం 2 సీట్లు వచ్చాయి. ఇక ఎన్పీపీకి 26 సీట్లు దక్కాయి.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 31 సీట్లు కావాల్సి ఉంటుంది. మరో మిత్రపక్ష పార్టీ ఏకంగా 11 సీట్లు దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ , టీఎంసీ చెరో సీట్లతో సరి పెట్టుకున్నాయి. శుక్రవారం కాన్రాడ్ సంగ్మా రాష్ట్ర గవర్నర్ ను కలిశారు. తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. తనకు మెజారిటీ ఉందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సీఎం కాన్రాడ్ సంగ్మాకు అభినందనలు(PM Modi Conrad Sangma) తెలిపారు.
అద్భుత విజయాన్ని సాధించినందుకు కంగ్రాట్స్ అంటూ కితాబు ఇచ్చారు. కొత్త సర్కార్ ఏర్పాటుకు తన ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు ఈ సందర్భంగా పీఎంకు, అమిత్ షాకు, బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం కాన్రాడ్ సంగ్మా. మేఘాలయ పురోగతి కోసం కలిసి పని చేయడం కోసం తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు పీఎం మోదీ. ఇదిలా ఉండగా కన్రాడ్ సంగ్మా ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. దాని వెనుక సీఎం సంగ్మా కృషి ఉంది.
Also Read : గవర్నర్ తో సీఎం సంగ్మా భేటీ