PM Modi Draupadi Murmu : ద్రౌపది ముర్ముకు మోదీ అభినందన
రాష్ట్రపతి అభ్యర్థిని కలుసుకున్న ప్రధాని
PM Modi Draupadi Murmu : భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది.
ఈనెల 24న ఆమె తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్రౌపది ముర్మును(PM Modi Draupadi Murmu) గురువారం కలుసుకున్నారు.
అనంతరం ప్రధాని మాట్లాడారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ద్రౌపది ముర్ము కు అవగాహన ఉందన్నారు. భారతదేశ అభివృద్దికి సంబంధించిన దృక్ఫథం గొప్పగా ఉందని కితాబు ఇచ్చారు మోదీ.
ద్రౌపది ముర్ము పేరును ప్రతిపాదించగానే దేశంలోని అన్ని వర్గాల నుండి ప్రశంసలు లభించాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది.
పార్టీ పరంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నుంచి కూడా అభ్యర్థులను పరిశీలించాలని ప్రధాని తెలిపారు. చివరకు క్లీన్ ఇమేజ్ కలిగిన , అట్టడుగు వర్గాలకు చెందిన ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం జరిగిందని వెల్లడించారు మోదీ.
దాదాపు 20 మంది పేర్లను పరిశీలించడం జరిగిందని అంతిమ నిర్ణయం మాత్రం ఏకగ్రీవంగా ముర్ము పేరును ప్రతిపాదించారని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా.
సమాజానికి, అణగారిన వర్గాలకు సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన జార్ఖండ్ మాజీ గవర్నర్ ఇప్పుడు రాష్ట్రపతిగా సేవలు అందించనుందని కొనియాడారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ.
Also Read : యువతపై కేసులు ఎత్తేయండి – తికాయత్
#WATCH | Delhi: Prime Minister Narendra Modi meets NDA's Presidential candidate Droupadi Murmu. She will file her nomination tomorrow, June 24th.
(Source: PMO) pic.twitter.com/FuiHbNEBbf
— ANI (@ANI) June 23, 2022