PM Modi : భారత్ పతకాల పంట మోదీ ప్రశంస
బెర్లిన్ లో జరిగిన పోటీల్లో 202 పతకాలు
PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రతిభా వంతులను ఎక్కడ ఉన్నా ప్రోత్సహిస్తారు. వారిని వెన్నుతట్టి ముందుకు నడిపించేలా వ్యాఖ్యానిస్తారు. ప్రధానంగా మోదీ సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ గా ఆయన ఇప్పటికే గుర్తింపు పొందారు. తాజాగా భారత దేశానికి చెందిన అథ్లెట్లు (క్రీడాకారులు) అరుదైన ఘనతను సాధించారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా భారీగా పతకాలను సాధించి రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఆనందాన్ని పంచుకున్నారు.
బెర్లిన్ నగరంలో ప్రతిష్టాత్మకమైన స్పెషల్ ఒలింపిక్స్ సమ్మర్ గేమ్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పోటీలలో భారత దేశం నుంచి అథ్లెట్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. 76 బంగారు పతకాలను సాధించారు. మొత్తంగా 202 పతకాలు సాధించి విస్తు పోయేలా చేశారు క్రీడాకారులు.
ఈ సందర్భంగా కీలకమైన సమయంలో అద్భుతంగా రాణించి అత్యధిక పతకాలను సాధించినందుకు గాను క్రీడాకారులను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోదీ. మీరు సాధించిన ఈ పతకాలు, విజయాలు దేశానికి గర్వ కారణంగా నిలిచాయని పేర్కొన్నారు.
Also Read : Arvind kejriwal LG : ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ విఫలం – సీఎం
