PM Modi : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం సక్సెస్ కావడంతో తాను సంతోషానికి లోనవుతున్నాని తెలిపారు. ఇస్రో చైర్మన్ , టీంకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఫోన్ చేసి అభినందించారు.
PM Modi Happy to Say
ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టంగా మోదీ అభివర్ణించారు. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నా నా మనసంతా చంద్రయాన్ -3 పైనే ఉందన్నారు ప్రధానమంత్రి(PM Modi). ఈ విజయంతో భారత దేశం కూడా ప్రపంచ దేశాల సరసన నిలిచిందని, దీనికి మీరే కారణమని ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ అద్భుతమైన క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా తాను ఎదురు చూశానని, మన ఇన్నేళ్ల కల నిజమైనందుకు, దానిని ఆచరణలో తీసుకు వచ్చినందుకు పేరు పేరును శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని తెలిపారు నరేంద్ర మోదీ. 140 కోట్ల భారతీయులందరికీ గర్వ కారణమయ్యేలా మీరు చేసిన కృషికి సలాం అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపింది. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. 15 ఏళ్ల కిందట చంద్రుడిపై నీరు ఉందని తేల్చింది. విశ్వ పరిశోధనల్లో కొత్త శ్వాసను భారత్ నింపింది.
ఇప్పుడు చంద్రయాన్-3తో జాబిలిపై ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లింది. ఎవరూ చూడని దక్షిణ జాడల్ని ప్రపంచానికి చూపించిందని ప్రపంచ చరిత్ర సృష్టించిందని ప్రధాని పేర్కొన్నారు.
Also Read : Tamilisai Governor : మమ్మల్ని గర్వపడేలా చేశారు – గవర్నర్
