PM Modi Kid : చిన్నారి న‌మ‌స్కారం మోదీ సంతోషం

మ్యూనిచ్ లో ప్ర‌ధానికి గ్రాండ్ వెల్ క‌మ్

PM Modi Kid : రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం జ‌ర్మ‌నీకి చేరుకున్నారు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆయ‌న‌కు జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వ స్వాగ‌తం పలికింది. ఈ సంద‌ర్భంగా మ్యూనిచ్ న‌గ‌రానికి చేరుకున‌న మోదీకి ఊహించ‌ని రీతిలో గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భించింది.

వేలాది మంది ప్ర‌ధాన మంత్రిని క‌లిసేందుకు, క‌ర‌చాల‌నం చేసేందుకు పోటీ ప‌డ్డారు. మోదీ ప్ర‌తి ఒక్క‌రినీ పేరు పేరునా ప‌ల‌క‌రిస్తూ వెళ్లారు. కానీ ఒక చోట మాత్రం ఆగి పోయారు ప్ర‌ధాన మంత్రి.

ప్ర‌వాస భార‌తీయులంతా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఇదే స‌మ‌యంలో సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించిన ఓ చిన్నారి చేతులెత్తి ప్ర‌ధాన మంత్రికి న‌మ‌స్కారం చేసింది.

దీంతో ఆ పాప చేసిన ప‌నికి సంతోషానికి లోన‌య్యారు. మోదీ(PM Modi Kid)  ఉబ్బి త‌బ్బిబ్బ‌య్యారు. ప్ర‌స్తుతం ఈ చిన్నారి ఫోటో వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ గా మారింది సోష‌ల్ మీడియాలో.

త‌న‌కు న‌మ‌స్క‌రించిన ఆ చిన్నారి పేరెంట్స్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఇలాంటి సంస్కృతి, సంప్ర‌దాయం, ఆహార్యం కేవ‌లం భార‌తీయుల‌కు మాత్ర‌మే ఉంద‌ని ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ఆ చిన్నారికి శుభాకాంక్ష‌లు తెలిపారు. మేరా భార‌త్ మ‌హాన్ అన్న నినాదాలు మిన్నంటాయి. మొత్తంగా ఇవాళ జ‌ర్మ‌నీ ప‌ర్య‌ట‌న‌లో చిన్నారి చేసిన వంద‌నం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉండ‌గా మ్యూనిచ్ లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప్ర‌ధాని ప్రసంగించారు. అనంత‌రం జి7 దేశాల స‌ద‌స్సులో పాల్గొంటారు.

Also Read : యావ‌త్ ప్ర‌పంచం భార‌త్ వైపు చూస్తోంది -మోదీ

Leave A Reply

Your Email Id will not be published!