Modi Shinzo Abe : కాల్పుల క‌ల‌క‌లం ప్ర‌పంచం విస్మ‌యం

ప‌లు దేశాధినేత‌లు, ప్ర‌ముఖుల సంతాపం

Modi Shinzo Abe : జ‌పాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి షింజో అబేను శుక్ర‌వారం కాల్చి చంప‌డంపై ప్ర‌పంచ వ్యాప్తంగా సంతాపం వ్య‌క్త‌మైంది. వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌ధాన మంత్రులు, దేశాధినేత‌లు స్పందించారు.

తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. జ‌పాన్ లోని నారా న‌గ‌రంలో ప్ర‌చారం చేస్తుండ‌గా ఆయ‌న‌పై కాల్పులు జ‌రిగాయి. భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (Modi Shinzo Abe) తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. గొప్ప స్నేహితుడిని, అంత కంటే గొప్ప నాయ‌కుడిని కోల్పోయిన‌ట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా షింజో ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో భార‌త దేశంలో స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తూ వ‌చ్చారు. ఎక్కువ కాలం ప్ర‌ధాన మంత్రిగా కొలువు తీరారు జ‌పాన్ లో. ఆయ‌న మృతిపై యుఎస్ రాయ‌బారి ర‌హ్మ్ ఇమాన్యుయెల్ సంతాపం వ్య‌క్తం చేశారు.

అబే సాన్ జ‌పాన్ కు అత్యుత్తమ నాయ‌కుడు. అమెరికాకు తిరుగులేని మిత్రుడని పేర్కొన్నారు. త‌మ దేశ ప్ర‌జ‌లు ఆయ‌న కుటుంబానికి, దేశ ప్ర‌జ‌ల క్షేమం కోసం ప్రార్థిస్తున్నార‌ని తెలిపారు.

ఆస్ట్రేలియా ప్ర‌ధాన మంత్రి ఆంథోనీ అల్బ‌నీస్ ట్వీట్ చేశారు. షింజో అంబే కాల్చి చంప‌బ‌డ్డాడ‌ని తెలిసి ఆశ్చ‌ర్యానికి లోన‌య్యా. ఈ స‌మ‌యంలో మా ఆలోచ‌న‌లు అత‌ని కుటుంబం, జపాన్ ప్ర‌జ‌ల‌తో ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

ఇండోనేషియా విదేశాంగ మంత్రి రెట్నో మార్సుడి జి20 విదేశాంగ మంత్రుల పేరుతో త‌న సానుభూతిని వ్య‌క్తం చేశారు. తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్ వెన్ స్పందించారు.

తైవాన్, జ‌పాన్ రెండూ చ‌ట్ట‌బ‌ద్ద‌మైన ప్ర‌జాస్వామ్య దేశాలు. నా ప్ర‌భుత్వం త‌ర‌పున నేను హింసాత్మ‌క , చ‌ట్ట విరుద్ద చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

Also Read : జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో కాల్చివేత‌

Leave A Reply

Your Email Id will not be published!