Mallikarjun Kharge PM Modi : విద్యా రంగంపై మోడీ వివ‌క్ష – ఖ‌ర్గే

ఎంత సేపు మ‌త విద్వేషాలేనా

Mallikarjun Kharge PM Modi : దేశంలో విద్యా రంగం కునారిల్లి పోయింద‌ని, దీనికి ప్ర‌ధాన కార‌ణం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్ల‌డారు. అస‌లు ఈ దేశంలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌న్నారు.

పొద్ద‌స్త‌మానం మతం పేరుతో రాజ‌కీయాలు చేయ‌డం త‌ప్ప దేశం ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను, స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదంటూ మండిప‌డ్డారు ఖ‌ర్గే. ప్ర‌తి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని హామీ ఇచ్చిన ప్ర‌ధాన‌మంత్రి ఇవాళ వాటి భ‌ర్తీ గురించి ఊసెత్త‌డం లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇటీవల వార్షిక విద్యా స్థితి నివేదిక‌ 2022 అధ్య‌య‌నం గురించి ప్ర‌స్తావించారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge). పాఠ్య పుస్త‌కాల‌ను చ‌దవ‌లేని స్థితిలోకి విద్యార్థులు వెళ్లి పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ప్ర‌ధాన‌మంత్రి అంటూ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ లేదా ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో రెండవ త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కాల‌ను చ‌ద‌వ గ‌లిగే విద్యార్థుల సంఖ్య 27.3 శాతం ఉండ‌గా అది 2022 నాటికి 20 శాతానికి ప‌డి పోయింద‌ని పేర్కొన్నారు.

5వ త‌ర‌గ‌తి విద్యార్థుల సంఖ్య 2018 లో 50.5 శాతం ఉంటే 2022 లో అది 42.8 శాతానికి త‌గ్గింద‌ని తాను చెప్ప‌డం లేద‌ని తాజా నివేదిక‌లో వాస్త‌వాలు వెల్ల‌డ‌య్యాయ‌ని తెలిపారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 30 ల‌క్ష‌ల‌కు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయ‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు మీరు ఎన్ని కొలువులు భ‌ర్తీ చేశారో దేశ ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఖ‌ర్గే డిమాండ్ చేశారు. ఈ ఎనిమిదేళ్ల‌లో 16 కోట్ల జాబ్స్ ఎక్క‌డ ఉన్నాయో చెప్పాల‌న్నారు.

Also Read : మోడీ ద‌మ్మున్న లీడ‌ర్ – బ్రిట‌న్ ఎంపీ

Leave A Reply

Your Email Id will not be published!