PM Modi Flags : 30న అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
ప్రారంభించనున్న ప్రధాని మోదీ
PM Modi Flags : న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా మరో సంచలనానికి తెర తీశారు. ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లను తీసుకు వచ్చింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం. ఇప్పటికే వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి.
PM Modi Flags New Express Trains
అత్యంత వేగవంతంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో వీటిని తయారు చేశారు. ఇది సమున్నత భారతావనికి గర్వ పడేలా తయారు చేయడం జరిగిందని ఇప్పటికే ప్రకటించారు ప్రధాన మంత్రి దామోదర దాజ్ నరేంద్ర మోదీ.
ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయవంతం కావడంతో తాజాగా మరో కీలక ప్రకటన చేశారు మోదీ. ఈ మేరకు వందే భారత్ తరహా లోనే అమృత్ భారత్ ఎక్స్ ప్పరెస్ రైళ్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
అయోధ్య వేదికగా డిసెంబర్ 30న వీటిని జెండా ఊపి ప్రారంభిస్తారని కేంద్ర సర్కార్ తెలిపింది. ఇదే క్రమంలో అదే రోజు అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఎయిర్ పోర్టును కూడా స్టార్ట్ చేస్తారని సమాచారం. మొత్తంగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఎలా ఉండ బోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది ప్రయాణీకుల్లో.
Also Read : Chandra Babu Naidu : గెలిపిస్తే మహిళలకు ఫ్రీ జర్నీ