PM Modi Inaugurate : 28న కొత్త పార్ల‌మెంట్ ప్రారంభం

ఆవిష్క‌రించ‌నున్న పీఎం మోదీ

నరేంద్ర మోదీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనిని పుర‌స్క‌రించుకుని మే నెల‌లో కొత్తగా నిర్మించిన పార్ల‌మెంట్ ప్రారంభం కానుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది కేంద్రం. 28న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ స్వ‌యంగా త‌న చేతుల మీదుగా ప్రారంభించ‌నున్నారు.

2014లో ప్ర‌ధానిగా కొలువు తీరారు. రెండోసారి కూడా తానే ప‌ద‌విని అధీష్టించారు. ఆపై ముచ్చ‌ట‌గా 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో సైతం గెలుపొంది ప్ర‌ధాని కావాల‌ని కోరుకుంటున్నారు. ఆ దిశ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్లాన్ చేసింది. వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది.

ప్ర‌త్యేకత‌లు చాలా ఉన్నాయి నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి. ఉభ‌య స‌భ‌ల్లోని సిబ్బంది కొత్త యూనిఫామ్ ను క‌లిగి ఉంటారు. దీనిని నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (నిఫ్ట్) రూపొందించింది. కొత్త నిర్మాణంలో మూడు త‌లుపులు ఉన్నాయి. ఒక‌టి జ్ఞాన్ ద్వార్ రెండు శ‌క్తి ద్వార్ మూడు క‌ర్మ ద్వార్. ఎంపీలు, వీఐపీలు, సంద‌ర్శ‌కుల కోసం ప్ర‌త్యేక ప్ర‌వేశాలు ఏర్పాటు చేశారు.

సవ‌రించిన నిబంధ‌న‌ల ప్ర‌కారం పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు జూలైలో కొత్త భ‌వ‌నంలో జ‌రుగుతాయ‌ని స‌మాచారం. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నానికి మోదీ 2020 డిసెంబ‌ర్ లో శంకుస్థాప‌న చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!