Donald Trump Modi : న‌రేంద్ర మోదీ అద్భుత‌మైన నాయ‌కుడు

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ కామెంట్స్

Donald Trump Modi : అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

అద్భుత‌మైన నాయ‌క‌త్వ ప‌టిమ క‌లిగిన నాయ‌కుడంటూ కితాబిచ్చారు. దేశ ప్ర‌ధానిగా త‌న బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నాడ‌ని పేర్కొన్నాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక‌మైన ఇంట‌ర్వ్యూలో త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

త‌న‌కు భార‌తీయ స‌మాజం నుండి వ‌చ్చిన భారీ మ‌ద్ద‌తుతో పాటు పీఎం మోదీతో ఉన్న సంబంధాల గురించి ప్ర‌స్తావించారు. తాను ప‌ద‌విలో ఉన్న స‌మ‌యంలో మోదీతో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నామ‌ని ఇది త‌మ స్నేహానికి గుర్తుగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump Modi) పేర్కొన్నారు.

గ‌తంలో ప్ర‌ధాన మంత్రుల కంటే ప్ర‌స్తుతం మోదీ సూప‌ర్ గా ప‌ని చేస్తున్నారంటూ ప్ర‌శంసించారు. భార‌త దేశానికి నా కంటే మంచి స్నేహితుడు ఎవ‌రూ లేరన్నారు.

2024లో తాను మ‌ళ్లీ బ‌రిలోకి దిగుతాన‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. న్యూయార్క్ స‌మీపంలోని బెడ్ మిన్ స్ట‌ర్ లోని త‌న ప్ర‌త్యేక గోల్ఫ్ క్ల‌బ్ లో ప్ర‌త్యేకంగా మాట్లాడారు ట్రంప్(Donald Trump).

ప్ర‌స్తుతం రాజ‌కీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అమెరికా వాసులు త‌న వైపు చూస్తున్నాన‌ని చెప్పారు ట్రంప్. బ‌రాక్ ఒబామా, బైడెన్ కంటే మోదీతో త‌న‌తోనే ఎక్కువ అనుబంధం ఉంద‌న్నారు.

భార‌త్ తో పాటే మోదీ తో నాకు మంచి స్నేహం ఉంది. గొప్ప వ్య‌క్తి బాగా ప‌ని చేస్తున్నాడ‌ని మ‌రోసారి గుర్తు చేశారు. ఇరు దేశాలు ప‌రస్ప‌రం గ‌ట్టి సంబంధాల‌ను క‌లిగి ఉన్నాయ‌ని పేర్కొన్నారు ట్రంప్.

Also Read : భార‌త్ జోడో యాత్ర‌కు భారీ స్పంద‌న

Leave A Reply

Your Email Id will not be published!