PM Modi : భార‌త్ బ్రాండ్ పేరుతో ఎరువుల విక్ర‌యం – మోదీ

ఒకే దేశం ఒకే ఎరువులు ప‌థ‌కం ప్రారంభం

PM Modi : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సోమ‌వారం కొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్న రైతుల‌కు మేలు చేకూర్చేలా ఒకే దేశం ఒకే ఎరువులు తీసుకు వ‌చ్చారు. దీని వ‌ల్ల దేశ‌మంత‌టా ఒకే ఎరువులు అందుబాటులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి.

రెండు రోజుల కార్య‌క్ర‌మం ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ స‌మ్మేళ‌న్ 2022 సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి(PM Modi) ఈ ప‌థ‌కం కింద సింగిల్ బ్రాండ్ భార‌త్ కొన‌సాగుతుంద‌న్నారు. ఎరువుల‌కు సంబంధించి ఇక నుంచి ఎలాంటి దొర‌క‌వ‌న్న ఇబ్బంది రైతుల‌కు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన కొత్త ప‌థ‌కం ఇది. ప్ర‌ధాన్ మంత్రి భారతీయ జ‌న్ ఉర్వ‌ర‌క్ ప‌రి యోజ‌న అన్న‌ది దీని పేరు. ఈ ప‌థ‌కం కింద ఎరువులు త‌యారు చేసే కంపెనీలు ఏవైనా స‌రే అన్ని స‌బ్సిడీ ఎరువుల‌ను ఒకే బ్రాండ్ భార‌త్ కింద మార్కెట్ చేయ‌నున్నారు. అధిక స‌రుకు ర‌వాణా సబ్సిడీని త‌గ్గించేందుకు ఇది ఉప‌యోగ ప‌డుతుంద‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి.

ఇందులో అన్ని స‌బ్సిడీ తో ల‌భించే నేల పోష‌కాలు యూరియా, డి అమ్మానియో ఫాస్పేట్ (డీఏపీ) , మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ), ఎన్పీకే ఇవ‌న్నీ దేశ వ్యాప్తంగా ఒకే బ్రాండ్ భార‌త్ కింద విక్ర‌యిస్తార‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ.

దీంతో పాటు దేశ మంత‌టా 600 పీఎం కిసాన్ స‌మృద్ది కేంద్రాల‌ను కూడా పీఎం ప్రారంభించారు. ఇది రైతుల‌కు స్టాప్ షాప్ వ‌లే ప‌ని చేస్తుంద‌న్నారు.

Also Read : ప్ర‌జ‌ల‌ కోసం ప్ర‌శ్నిస్తే కేసులా – జ‌న‌సేనాని

Leave A Reply

Your Email Id will not be published!