PM Modi Tour : బైడన్ ఆహ్వానం మోదీ పయనం
అమెరికా..ఈజిప్టు దేశాలలో ప్రధాని టూర్
PM Modi Tour : అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ , ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ అమెరికా సంయుక్త రాష్ట్రాల పర్యటనకు(PM Modi Tour) బయలు దేరి వెళ్లారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, యుఎస్ లు పేరు పొందాయి. ఇప్పటికీ ఆ విలువల పునరుద్దరణ కోసం పాటు పడుతున్నాయి. ఇరు దేశాల మధ్య భాగస్వామ్య శక్తి, చైతన్యానికి ప్రతిబింబంగా ఉన్నాయి.
అమెరికా పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా సెషన్ కు నాయకత్వం వహిస్తారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించాలని కోరుతూ భారత దేశం ప్రత్యేకంగా పోరాటం చేసింది. ఆ మేరకు మోదీ ప్రయత్నం ఫలించింది. యోగాను ఇంటర్నేషనల్ డేగా డిక్లేర్ చేసింది యుఎన్ఓ. ఇందుకు మద్దతు తెలిపిన దేశాలకు, అధిపతులకు ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి.
అనంతరం వాషింగ్టన్ డీసీకి వెళతారు. అక్కడ వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ బైడెన్ ఇచ్చే విందుకు హాజరవుతారు. కాగా అమెరికా భారత దేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నారు. సైన్స్ , టెక్నాలజీ, విద్య, ఆరోగ్యం, రక్షణ , పారిశ్రామిక సహకారం, అంతరిక్షం, టెలికాం, క్వాంటం, ఏఐ , బయో టెక్నాలజీ రంగాలపై ఫోకస్ పెట్టనున్నారు మోదీ. యుఎస్ టూర్ అనంతరం అక్కడి నుంచి ఈజిప్టుకు వెళతారు ప్రధానమంత్రి.
Also Read : Gita Press Comment : అరుదైన పురస్కారం సేవకు సలాం
