Modi Chai : మోదీకి ‘చాయ్’ అంటే చచ్చేంత ఇష్టం
ఒకప్పటి చాయ్ వాలా నేటి ప్రధానమంత్రి
Modi Chai : నరేంద్ర మోదీ ఈ పేరు తెలియని భారతీయులంటూ ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దేశాధి నేతలలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా ఇప్పటికే నీరాజనాలు అందుకున్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఆయన చిన్నతనంలో తన మేనమామ టీ స్టాల్ లో టీలు అమ్మారు. రైల్వే స్టేషన్ లో చాయ్ వాలా గా మారారు. అనంతరం సుశిక్షుతుడైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు.
ఊహించని రీతిలో ఎన్నో పదవులు నిర్వహించారు. అనంతరం గుజరాత్ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికయ్యారు. కాషాయ పార్టీకి మోదీనే పెద్ద దిక్కుగా మారారు.
2014లో భారత దేశంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టారు 130 కోట్లకు పైగా జనాభా కలిగిన సమున్నత భారతానికి ప్రధాన మంత్రిగా కొలువు తీరారు. మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మన్ కీ బాత్ లాంటి పథకాలను ప్రవేశ పెట్టారు.
ప్రస్తుతం ఆయన భారత్ కు పెద్ద దిక్కుగా మారారు. ఒకప్పటి చాయ్ వాలా ఇవాళ దేశాన్ని నడిపించే నాయకుడిగా ఎలా మారారు అన్నది ఓ పాఠంగా చదివేందుకు వీలు కలుగుతుంది.
ఎందుకంటే ఆయన మన మధ్యనే ఉన్నారు. ఈ చాయ్ వాలాకు చాయ్ (టీ) అంటే చచ్చేంత ఇష్టం. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 2005 నుంచి మే 21న వరల్డ్ టీ డే ను జరుపు కోవడం ఆనవాయితీ.
ఇవాళ టీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Modi Chai) తనకు ఇష్టమైన చాయ్ ను గుర్తు చేసుకుంటూ టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : కోర్టులో లొంగి పోయిన సిద్దూ జైలుకు