PM Modi Manipur : శాంతితోనే సమస్యకు పరిష్కారం
హింసోన్మాదం పనికి రాదన్న ప్రధాని
PM Modi Manipur : హింస ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదు. దానిని నేనే కాదు ఏ భారతీయుడు అంగీకరించడు. భారత దేశం అంటేనే శాంతికి చిహ్నం. శాంతితోనే హింస నుంచి వేరు పడగలమని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై భారతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు మోదీ.
PM Modi Manipur Issues Discussion
137 కోట్ల మంది భారతీయులంతా నా కుటుంబీకులేనని అన్నారు ప్రధానమంత్రి(PM Modi). గతంలో ఎప్పుడు మాట్లాడినా లేదా ప్రసంగించినా నా సోదర సోదరీమణులారా అని ప్రారంభ ఉపన్యాసం చేసేవారు. కానీ ఈసారి దానిని మార్చేశారు. మీరంతా నా కుటుంబీకులేనని ప్రకటించారు.
ఆయన మూడోసారి ముచ్చటగా పవర్ లోకి వస్తామని, మరోసారి తాను ఇదే ఎర్రకోట సాక్షిగా జెండా ఎగుర వేస్తానని ధీమా వ్యక్తం చేశారు ప్రధానమంత్రి. తన పదేళ్ల కాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని కానీ వాటినన్నింటినీ ధైర్యంగా పరిష్కరించడం జరిగిందన్నారు మోదీ.
సుస్థిర పాలనను అందించానని చెప్పారు. వెయ్యి సంవత్సరాల్లో భవ్య భారతాన్ని ఆవిష్కిరంచేందుకు చర్యలు చేపట్టానని అన్నారు. ఇక అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు ఈ మూడు దేశానికి , అభివృద్ధికి అవరోధంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి.
Also Read : Chandrababu Naidu Gaddar : గద్దర్ వ్యక్తి కాదు వ్యవస్థ – బాబు