PM Modi Mother : తల్లి ఆశీర్వాదం తనయుడు సంతోషం
అటల్ బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ
PM Modi Mother : ఆయన దేశానికి ప్రధాన మంత్రి కావచ్చు. కానీ ఓ తల్లికి కొడుకే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిత్యం బిజీగా ఉంటారు. ఆయన ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో తన మేనమామ నిర్వహిస్తున్న టీ కొట్టులో చాయ్ అమ్మాడు. ఆపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కార్యకర్తగా పని చేశాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.
సీఎంగా, పీఎంగా ఎదిగారు. గుజరాత్ లో అటల్ బిహారీ వాజ్ పేయి పేరుతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఆయన తన తల్లి వద్దకు వెళ్లారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
గత జూన్ నెలలో తన తల్లి 100వ పుట్టిన రోజు సందర్భంగా జూన్ లో కలుసుకున్నారు. తన సొంత రాష్ట్రానికి రెండు రోజుల పర్యటనలో ఉన్న ఆయన అక్కడ కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు.
అహ్మదాబాద్ లో జరిగిన ఖాదీ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి తన తల్లి హీరా బెన్(PM Modi Mother) తో కలిసి అరగంట పాటు గడిపారు. ఈ విషయాన్ని మోదీ తమ్ముడు పంకజ్ మోదీ వెల్లడించారు.
ఆమెకు అంకితం చేసిన బ్లాగ్ పోస్ట్ ను కూడా రాశాడు. తన తండ్రి కూడా ఈ ఏడాది తన శతాబ్దిని పూర్తి చేసుకుంటాడు. ఈ సందర్భంగా 2022 ని తమ కుటుంబానికి ఓ ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నాడు.
గాంధీనగర్ లోని రాజ్ భవన్ కు వెళ్లిన ప్రధాని అక్కడ రాత్రి బస చేశారు.
Also Read : స్పీడ్ పెంచిన సీజేఐ జస్టిస్ లలిత్