PM Modi Bhilwara : క‌మలం గుజ్జ‌ర్ల‌తో శాశ్వ‌త బంధం – మోదీ

1111వ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాని

PM Modi Bhilwara : రాజ‌స్థాన్ లో ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. త్వ‌ర‌లోనే శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో నువ్వా నేనా అన్న రీతిలో బీజేపీ, కాంగ్రెస్ యుద్దం చేస్తున్నాయి. ప్ర‌ధానంగా రాష్ట్రంలో గుజ్జ‌ర్లకు చెందిన సామాజిక వ‌ర్గం 10 నుంచి 12 శాతంగా ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ క‌మ్యూనిటీ ఆరాధించే భ‌గ‌వాన్ దేవ్ నారాయ‌ణ్ 1111వ జ‌యంతి ఇవాళ‌.

దీనిని పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం శ‌నివారం సెల‌వు ప్ర‌క‌టించింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప‌నిగ‌ట్టుకుని ప‌ర్య‌టించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇరు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌చారం కూడా చేశాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ ప్ర‌సంగించారు.

కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌మాజ అభివృద్దిలో గుజ్జ‌ర్లు కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని కొనియాడారు . క‌మ‌లంతో చాలా అనుబంధం క‌లిగి ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు కావాలంటూ గుజ్జ‌ర్లు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఈ స‌మ‌యంలో తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తే గుజ్జ‌ర్ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ.

ఆయ‌న భ‌గ‌వాన్ దాస్ నారాయ‌ణ్ జ‌యంతి సంద‌ర్భంగా రాజ‌స్థాన్ లోని భిల్వారాల(PM Modi Bhilwara)  మ‌ల‌సేరిని సంద‌ర్శించారు. ప్ర‌త్యేకంగా పూజ‌లు చేశారు. కేంద్ర సాంస్కృతిక పర్యాట‌క శాఖ ఆధ్వ‌ర్యంలో దీనిని చేప‌ట్టారు. ఇది రాజ‌కీయ వివాదానికి దారి తీసింది.

పోయిన‌సారి గుజ్జ‌ర్లు ఓడి పోయారు. ఇప్పుడు గుణ‌పాఠం నేర్చుకున్నారు. గుజ్జ‌ర్ల స‌పోర్ట్ త‌మ‌కు త‌ప్ప‌క ఉండి తీరుతుంద‌న్నారు బీజేపీ నేత విజ‌య్ బైన్సా.

Also Read : ఆప్ స‌ర్కార్ అవినీతికి కేరాఫ్ – ఠాకూర్

Leave A Reply

Your Email Id will not be published!