PM Modi : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం బాధాకరం
స్నేహితుడు..వ్యాపార వేత్తను కోల్పోయాను
PM Modi : ప్రముఖ వ్యాపారవేత్త రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా రాకేష్ తో తనకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
భారత దేశం గొప్ప వ్యాపారవేత్తను కోల్పోయిందని పేర్కొన్నారు మోదీ. ఒక రకంగా స్నేహితుడిని, ఆత్మీయుడిని కోల్పోవడం బాధాకరమన్నారు.
తాను కలిసిన సమయంలో ఎన్నో అంశాల గురించి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు నరేంద్ర మోదీ. ఒక రకంగా దేశం దిగ్గజ వ్యాపార వేత్తను కోల్పోవడం తీరని నష్టమన్నారు.
ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ప్రశంసించారు. ఇదిలా ఉండగా రాకేష్ ఝున్ ఝున్ వాలాను ఇండియన్ వారెన్ బఫెట్ గా పేర్కొంటారు.
ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ఆయన 5 జూలై 1960లో పుట్టారు. ప్రస్తుతం ఝున్ ఝున్ వాలా వయస్సు 62 ఏళ్లు. భారతీయ బిలీయనీర్ వ్యాపారవేత్త. స్టాక్ వ్యాపారి, పెట్టుబడిదారు.
తన ఆస్తి నిర్వహణ సంస్థ, రేర్ ఎంటర్ ప్రైజెస్ లో భాగస్వామిగా ఉన్నారు. స్వంత పోర్ట్ పోలియోను నిర్వహించారు. మహారాష్ట్రలోని ముంబైలోని రాజస్తానీ కుటుంబంలో పెరిగాడు.
ఆయన తండ్రి ఆదాయపు పన్ను కమిషనర్ గా పని చేశారు. సిడెన్ హోమ్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరాడు.
ఝున్ ఝున్ వాలా నికర విలువ $5.5 బిలియన్లుగా ఉంది. జూలై 2022 నాటికి భారత దేశంలో 36వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
Also Read : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత