PM Modi UAE : మోదీకి స్వాగ‌తం యూఏఈ చీఫ్ ఆలింగ‌నం

ప్ర‌వ‌క్తపై వ్యాఖ్య‌ల అనంత‌రం దుబాయ్ టూర్

PM Modi UAE : అరుదైన స‌న్నివేశానికి వేదికైంది యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) . జ‌ర్మ‌నీలో జీ7 స‌మ్మిట్ లో పాల్గొన్న అనంత‌రం భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం యూఏఈ(PM Modi UAE) లో కొలువు తీరారు.

రెండు రోజుల టూర్ అనంత‌రం మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌ల అనంత‌రం మొద‌టి సారిగా మోదీ యూఏఈలో అడుగు పెట్టారు. ఈ మేర‌కు భార‌త దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి ఈ విష‌యం గురించి అధికారికంగా ట్వీట్ చేశారు.

అబుదాబి విమానాశ్ర‌యంలో స్వాగ‌తం ప‌లికారు యుఏఈ దేశ అధ్య‌క్షుడు మొహ‌మ్మ‌ద్ బిన్ జాయెద్ అల్ న‌హ్యాన్ . ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని అర‌బ్ దేశాధిప‌తి బిన్ జాయ‌ద్ ఆలింగ‌నం చేసుకున్నారు.

ఒక‌రినొక‌రు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ ప‌ల‌క‌రించు కోవ‌డంతో ఒక్క‌సారిగా కెమెరాలు క్లిక్ మ‌నిపించాయి.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. గ‌ల్ఫ్ లో ఆగ్ర‌హం తెంచుకున్న వారం రోజుల‌కే ప్ర‌ధాని యూఏఈకి చేరుకోవడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్వ‌యంగా త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో అనుభూతుల్ని పంచుకున్నారు.

అబుదాబి ఎయిర్ పోర్ట్ లో నాకు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన నా సోద‌రుడు షేక్ మొహమ్మ‌ద్ బిన్ జాయెద్ అల్ న‌హ్యాన్ కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు.

నాకు స్వాగ‌తం ప‌లికినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి. ఇదిలా ఉండగా మేలో మ‌ర‌ణించిన షేక్ మ‌హ్మ‌ద్ సోద‌రుడు, మాజీ చీఫ్ షేక్ ఖ‌లీఫా బిన్ జాయెద్ కు త‌న సానుభూతిని తెలియ చేసేందుకు ప్ర‌ధాని అర‌బ్ లో ప‌ర్య‌టించారు.

Also Read : ప్ర‌పంచం చూపు భార‌త దేశం వైపు

Leave A Reply

Your Email Id will not be published!