జాతీయ రోజ్ గార్ మేళాలో కొత్తగా రిక్రూట్ అయిన 71,000 మందికి నియామక లేఖలను మంగళవారం పంపిణీ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతి పాలసీ ఉపాధి కల్పించే ద్వారంలా పని చేస్తుందన్నారు. లేఖలు అందుకున్న అభ్యర్థులను, వారి కుటుంబాలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
దేశంలో ఉపాధిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పీఎం ఇవాళ వివరించారు. గత తొమ్మిదేళ్లలో రూపొందించిన ప్రతి విధానం యువతకు ఎంతగానో భరోసాను ఇచ్చిందని చెప్పారు పీఎం. వర్చువల్ గా ప్రధాని ప్రసంగించారు. ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడం లేదా గ్రామీణాభివృద్దిని నిర్మించడం ఏదైనా ప్రభుత్వం ప్రతి ప్రణాళిక , విధానం ఒకే విధంగా పని చేస్తాయని చెప్పారు ప్రధానమంత్రి.
తన పాలనా కాలంలో ప్రభుత్వ నియామక ప్రక్రియను వేగవంతంగా మరింత పారదర్శకంగా , నిస్పక్షపాతంగా చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు నరేంద్ర మోదీ. ఇవాళ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేయడం నుండి ఫలితాలు పొందడం దాకా మొత్తం ప్రక్రియ ఆన్ లైన్ గా మారింది. గ్రూప్ – సి, డి లో కూడా ఇంటర్వ్యూలు ముగిశాయన్నారు మోదీ. ఈ ప్రయత్నాల ప్రయోజనం ఏమిటంటే అవినీతి, బంధుప్రీతి అవకాశాలకు గండి పడ్డాయని స్పష్టం చేశారు.
