PM Modi : దేశంలోని ప్ర‌తి భాష గురించి గ‌ర్వ‌ప‌డాలి

స్ప‌ష్టం చేసిన దేశ ప్ర‌ధాన మంత్రి మోదీ

PM Modi : మ‌న దేశంలోని ప్ర‌తి భాష గురించి మ‌నం గ‌ర్వ ప‌డాల‌ని అన్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్ల‌వుతోంది. ఎర్ర‌కోట‌పై జెండాను ఎగుర వేసిన ప్ర‌ధాని జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌తి భాష గొప్ప‌దేన‌ని అన్నారు. ఎన్నో కులాలు, ఎన్నో మ‌తాలు, ఎన్నో భాష‌లు ఈ దేశంలో ఉన్నాయి. భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని సాధించ‌డ‌మే భార‌త దేశానికి ఉన్న గొప్ప బ‌ల‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి(PM Modi).

ఈ దేశానికి ఉన్న ప్ర‌ధాన బ‌లం జ‌నం, ప్ర‌జాస్వామ్యం అని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏ భాష ఇంకో భాష‌తో అనుసంధానం అవుతూ వ‌స్తోంది. దేనిక‌దే ప్ర‌త్యేకం. ప్ర‌తి భాష‌కు చరిత్ర ఉంద‌న్నారు న‌రేంద్ర మోదీ.

మ‌న భాష ప‌ట్ల మ‌నం ప్రేమ పూర్వ‌కంగా ఉండాల‌ని ఉద్భోదించారు. భాష ప‌ట్ల ద్వేష భావం ఉండ‌కూడ‌ద‌ని సూచించారు. ఆయా భాష‌ల‌లో ఎంతో అపూర్వ‌మైన విజ్ఞానం దాగి ఉంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి.

కొన్ని సార్లు మ‌న ప్ర‌తిభ‌కు భాషా అవ‌రోధాలు ప‌రిమితం చేయ‌బ‌డ‌తాయ‌న్నారు. ఇదే స‌మ‌యంలో మాతృ భాష ప‌ట్ల మ‌మకారం క‌లిగి ఉండాల‌న్నారు.

గ‌తంలో లాగే భార‌త దేశం త‌న వైవిధ్యాన్ని ఇలాగే నిలుపుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని పిలుపునిచ్చారు న‌రేంద్ర మోదీ. భార‌త‌దేశం ప్ర‌జాస్వామ్యానికి త‌ల్లి, వైవిధ్యం దాని బ‌లం అని స్ప‌ష్టం చేశారు.

మ‌న వైవిధ్యం నుండి మ‌న‌కు స్వాభావిక బ‌లం ఉంద‌ని మ‌న దేశం నిరూపించింద‌న్నారు న‌రేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi).

Also Read : భిన్న‌త్వంలో ఏక‌త్వం భార‌త్ బ‌లం

Leave A Reply

Your Email Id will not be published!