PM Modi : త్యాగాలకు ప్రతీక మొహర్రం – మోదీ
ముస్లింలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
PM Modi : మొహర్రం సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీక మొహర్రం అని పేర్కొన్నారు.
ముస్లింలు కర్పలా యుద్దంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ అమర వీరుడు అయిన జ్ఞాపకార్థం ఈ రోజును మొహర్రంగా పాటిస్తారు.
హజ్రత్ ఇమామ్ హుస్సేన్ సమానత్వం, సోదర భావానికి ఉంచిన గొప్ప ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. 7వ శతాబ్దపు విప్లవ నాయకుడు, ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ త్యాగాలను, సత్యం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్దత , అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు మొహర్రం ట్వట్ లో పేర్కొన్నారు.
హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాలను గుర్తు చేసుకునే రోజు. సత్యం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్దత, అన్యాయానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి జ్ఞాపకం, సమానత్వం, సౌభ్రాతృత్వానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని ట్వీట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాన మంత్రి.
హుస్సేన్ యాజిద్ కు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం చేసిన త్యాగానికి ప్రసిద్ది చెందారు. ఇవాళ ముస్లింలు యుద్దం వంటి కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధించబడ్డారు.
ప్రార్థన, ప్రతిబింబం కాలంగా దీనిని ఉపయోగిస్తారు. ఇమ్రాన్ హుస్సేన్ త్యాఆన్ని సీఎంలు నితీశ్ కుమార్ , అరవింద్ కేజ్రీవాల్ తో సహా పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా మొహర్రం సందర్భంగా నేను కర్బలా అమర వీరులకు , హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాలకు నమస్కరిస్తున్నాను. ఆయన ఆదర్శాలను స్వీకరించాలని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఇవాళ మొహర్రం త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు.
Also Read : కాషాయ బంధానికి జేడీయూ కటీఫ్