Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి.
ఈ తరుణంలో దేశంలోని చమురు కంపెనీలు తాట తీస్తున్నాయి. ధరా భారం మోపుతున్నాయి. వాహనదారులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఈ తరుణంలో కంట్రోల్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందంటూ ఆరోపిస్తున్నాయి విపక్షాలు. వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం పని చేస్తోందంటూ మండి పడుతున్నాయి.
తాజాగా ఎన్నడూ నోరు మెదపని దేశ ప్రధాని ఇవాళ స్వరం వినిపించారు పెట్రోల్, డీజిల్ ధరలపై. ఆయన మరోసారి మహారాష్ట్రను టార్గెట్ చేశారు. ప్రస్తుతం కేంద్రం వర్సెస్ మరాఠా అన్న స్థాయిలో పోటీ నెలకొంది.
ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ తరుణంలో కరోనా గురించి ప్రస్తావించిన మోదీ (Modi )అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పెట్రోల్ ధరల గురించి కూడా ప్రస్తావించారు.
ఆయా రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాలని కోరారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కొన్ని మాత్రమే తగ్గించాయి. ఇప్పటికైనా పన్నులు తగ్గించాలని కోరుతున్నానని తెలిపారు మోదీ.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104 ఉండగా మహారాష్ట్రలో ఎక్కువగా రూ. 122గా ఉందన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ పై మరాఠా సర్కార్ భగ్గుమంది. విపక్షాలు సైతం మోదీని తప్పు పడుతున్నాయి.
Also Read : వెండి ఇటుకలు, గోనె సంచుల్లో నగదు