PM Modi : గ‌త పాల‌కుల నిర్వాకం అవినీతిమ‌యం

పార్ల‌మెంట్ లో నిప్పులు చెరిగిన మోదీ

PM Modi : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పార్ల‌మెంట్ సాక్షిగా నిప్పులు చెరిగారు. తాను అదానీకి స‌పోర్ట్ చేస్తున్నానంటూ ప్ర‌తిపక్షాలు చేసిన విమ‌ర్శ‌ల‌కు ధీటుగా స‌మాధానం చెప్పారు. గ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల దేశంలో అవినీతి ఆక్టోప‌స్ లా విస్త‌రించింద‌ని ఆరోపించారు.

2004 నుంచి 2014 దాకా అవినీతి రాజ్యం ఏలింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మోదీ. అంతే కాదు ఆ కాలంలోనే కశ్మీర్ నుంచి క‌న్యాకుమారి దాకా ఉగ్ర‌వాదం పెచ్చ‌రిల్లింద‌ని ఆరోపించారు. తాను ఎప్పుడైతే 2014లో ప‌వ‌ర్ లోకి వ‌చ్చానో వీటిని కంట్రోల్ చేశాన‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా మోదీ(PM Modi) ప్ర‌సంగించారు. రాష్ట్రప‌తి స‌భ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం దేశ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌న్నారు. అంతే కాదు ఆదివాసీ స‌మాజానికి ద‌క్కిన అపురూప‌మైన గౌర‌వ‌మ‌ని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశార‌ని, అది ఆయ‌న‌లో ఉన్న ద్వేషాన్ని బ‌య‌ట పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు న‌రేంద్ర మోదీ.

త‌మ ప్ర‌భుత్వం కొలువు తీరాక పేరుకు పోయిన అవినీతిని ప్ర‌క్షాళ‌న చేశామ‌ని చెప్పారు. 140 కోట్ల ప్ర‌జ‌ల సంక్షేమం త‌న‌కు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి. క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని చెప్పారు. జీ20 గ్రూప్ కు ప్ర‌స్తుతం భార‌త దేశం నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌న్నారు. ప్ర‌స్తుతం ఈ దేశం అతి పెద్ద ఆర్థిక శ‌క్తిగా ఎదిగింద‌ని చెప్పారు ప్ర‌ధానమంత్రి. యావ‌త్ ప్ర‌పంచం భార‌త్ వైపు చూస్తోంద‌న్నారు. మొబైళ్ల త‌యారీలో దేశం రెండో స్థానంలో నిలిచింద‌న్నారు.

Also Read : ఏబీకేకు రామ్మోహ‌న్ రాయ్ అవార్డు

Leave A Reply

Your Email Id will not be published!