PM Modi : సంత్ తుకారాం బోధ‌న‌లు అనుస‌ర‌ణీయం

శిలా ఆల‌యాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ

PM Modi : కుల వివ‌క్ష మ‌హా పాపం అన్నారు ఆనాడు సంత్ తుకారాం మ‌హ‌రాజ్. అన్ని మ‌తాలు, కులాలు, వ‌ర్గాలు ఒక్క‌టే. ప్ర‌తి ఒక్క‌రిలోనూ దైవం ఉంటుంద‌ని న‌మ్మి ఆచ‌రించిన మ‌హానుభావుడు అని కొనియాడారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) .

ఇవాళ ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ను జ‌రుపుకుంటోంద‌న్నారు. తాము అత్యంత ప్రాచీన‌మైన‌, స‌జీవ‌మైన నాగ‌రిక‌త‌ల‌లో ఒక‌టిగా ఉన్నందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు మోదీ.

దేశంలో ఎన్నో కాలాల నుంచి సంత్ ప‌రంప‌ర కొన‌సాగుతోంద‌ని, రుషులు, మ‌హానుభావులు, యోగులు న‌డ‌యాడిన గొప్ప నేల ఇద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి. భార‌త దేశం ప‌విత్ర‌మైన‌, సాధువుల భూమి అని పేర్కొన్నారు.

సంత్ తుకారం మ‌హారాజ్ చేసిన బోధ‌న‌లు భ‌క్తికి మాత్ర‌మే కాదు దేశ భ‌క్తికి , స‌మాజ శ్రేయ‌స్సుకు కూడా అవ‌స‌ర‌మ‌న్నారు మోదీ. 17వ శ‌తాబ్దపు లో వెల‌సిన మ‌హారాష్ట్ర లోని పుణె ఆల‌యాన్ని మంగ‌ళ‌వారం ప్ర‌ధాన మంత్రి సంద‌ర్శించి టూర్ ను ప్రారంభించారు.

ఈనెల 20న దేహూ నుండి ప్రారంభ‌మ‌య్యే వార్షిక – వారి- సంప్ర‌దాయానికి ముందు వ‌చ్చే – వార్కారీ-ల‌తో మోదీ సంభాషించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రికి శిర‌స్త్రాణం, తుకారం ప‌గిడిని కూడా బ‌హూక‌రించారు.

కాగా సంత్ తుకారాం మ‌హరాజ్ భ‌క్తి ఉద్య‌మంలో ప్ర‌ముఖుడు. అంత‌కు ముందు మోదీ(PM Modi) తుకారాం మ‌హారాజ్ ఆలయంలో శిలా ఆల‌యాన్ని ఆవిష్క‌రించారు.

వార్కారీ వేష‌ధార‌ణ‌లో ఉన్న ప్ర‌ధానికి మురుద్క‌ర్ త‌యారు చేసిన డిజైనర్ తుకారాం త‌ల‌పాగాను బ‌హూక‌రించారు. దేహూ లోని శిలా దేవాల‌యం కేవ‌లం ప్రార్థ‌నా స్థ‌లం కాదు. దేశ సాంస్కృతిక భ‌విష్య‌త్తును కూడా సూచిస్తుంద‌న్నారు మోదీ.

Also Read : అమెరికాలో శ్రీ‌వారి క‌ళ్యాణోత్స‌వాలు

 

 

Leave A Reply

Your Email Id will not be published!